దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్‌డౌన్ పొడగింపు

lockdown-will-bring-down-coronavirus-mortality-in-india-by-at-least-50-devi-shetty

జాతీయం : దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అక్కడ యథాతధంగా లాక్‌డౌన్ కొనసాగుతుందని ఉత్తర్వులో పేర్కొంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లనో మాత్రం కొంత వరకు ఆంక్షలను సడలిస్తారు. అప్పటి వరకు విమానాలు, మెట్రో, రైళ్లు ప్రయాణాలపై నిషేధం ఉంటుందని పేర్కొంది. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్లు, జిమ్స్, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇది అన్ని జోన్లకూ వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. రెడ్ జోన్లలోనూ కొన్నంటికి మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించవచ్చు. ఐతే వలస కార్మికులను తరలించే బస్సులు, రైళ్లకు మాత్రం అనుమతి ఉంటుంది.


  • విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం 
  • స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌ 
  • హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌ 
  • స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి 
  • అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు
  •  అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి
  •  గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు 
  •  33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి
  •  రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
  •  బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి 
  • గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ఆన్‌ లైన్‌ షాపింగ్‌కు అనుమతి
  •  ప్రైవేట్‌ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి
  •  అన్ని రకాల గూడ్స్‌, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి
  •  బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించాల్సిందే 
  • పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు
  •  అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి 
  •  రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు 
  • వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన 
  • కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు
  •  గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
  •  గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి 
  • ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి 
  • ఆరెంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
  • ఆరెంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి 
  • ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు 
  • గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్‌ క్యాబ్‌లకు అనుమతి
  •  వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి 
  • రెడ్‌ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు