జూన్‌ 15 నుంచి పదో తరగతి పరీక్షలు : పాఠశాల విద్యాశాఖ కసరత్తు


ఫ్లాష్ న్యూస్ : కరోనా వైరస్ దాటికి తో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూన్‌ 15 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మార్చి 19న ప్రారంభమై.. 3 పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇంకా 8 ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా జూన్ రెండవ లేదా మూడవ వారాల్లో పదో తరగతి పరీక్షలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఉన్నత వర్గాల వెల్లడి .