వెంకటాపురం లో డస్ట్‌బిన్ లు పంపిణి చేసిన గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ కార్యదర్శి చెన్నారావ్

గిద్దలూరు మండలంలోని వెంకటాపూరం గ్రామం లోని గ్రామ వాలంటీర్లు శుక్రవారం స్థానిక ప్రజలకు స్వచ్చభారత్ కార్యక్రమంలో భాగంగా చెత్తడబ్బాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి చెన్నారావ్ మండ్లపాడు గారు పాలోన్నారు. వారు మాట్లాడుతూ ప్రజలు ఇండ్లలోని చెత్తాచెదారాలను వీధులలో పడవేయకుండా తడి, పొడి చెత్తలను వేర్వేరు డబ్బాలలో ఉంచి పారిశుద్ధ్య సిబ్బంది వచ్చిన సమయంలో వారికి అప్పగించాలన్నారు. తద్వారా ప్రజలు వ్యాధులకు దూరమయ్యే అవకాశం ఉంటుందన్నారు.