RTC కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని స్పష్ట్రం చేసిన KCR సర్కార్ : గవర్నన్ తో భేటి ఆంతర్యమేమిటి ?


RTC సమ్మె ప్రారంభం , ముగింపు మధ్యలో ఎన్నో ఘట్టాలు  ఉన్నాయి . మొదటగా కార్మికులు మాత్రమే మెదలేట్టిన , మధ్యలో ప్రతిపక్షాలు ఎదురొచ్చి RTC కి సహకరించాయి . కాని కాలం గడుస్తున్న కొద్ది ఒంటరిగా మిగిలిన RTC  రెండు నెలలుగా జీతాలు లేక , ఉద్యోగం ఉంటుందా , ఉడుతుందా తేల్చుకోలేక తర్జన భర్జన పది ఎట్టకేలకు మేము విధుల్లో చేరుతాం అని ప్రకటించిన ఎ మాత్రం లాభం లేకుండా పోయింది . RTC కి  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. మంగళవారం ఉదయం విధులకు హాజరవుతామని కార్మిక సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
RTC విషయంలో ప్రముఖులు పలు రకాలుగా స్పందిస్తునారు. అందులో ఆర్టీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని సునీల్‌ శర్మ పేర్కొన్నారు. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు.
ఈ నిర్ణయం దృష్ట్యా నగరంలో హై ఎలర్ట్ పరిస్థతి అని ఉహించిన కెసిఆర్  అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. పరిస్థితులను సమీక్షించాలని  తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ కార్మికులకు సమ్మె చేయమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకునేవరకు వేచి చూడాలని కార్మికులకు సూచించారు. ఆ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని.. అప్పటివరకు సంయమనం పాటించాలని కోరారు. కార్మికులు యూనియన్ల మాటలు విని ఇప్పటికే  నష్టపోయారు.. ఇక ముందు వారి మాటలు విని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని అన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆర్టీసీ యాజమాన్యం క్షమించదని తెలిపారు.