తంగడపల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అర్థమయ్యే విధంగా ప్రకృతి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు


సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పరిధిలో ఉన్న తంగడపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు అర్థమయ్యే విధంగా తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్న ఆహార పంటలు పుస్తకాలలో ఉన్న బోధనను వారు స్వయంగా చూసి నేర్చుకునే విధంగా విద్యార్థులను పంట పొలాలకు తీసుకెళ్లి పంటలను చూయిస్తూ బోధించారు. అందులో ముఖ్యంగా గోధుమ పంట, చెరకు పంట ,వరి పంట, పత్తి పంటలను రైతులు ఏ విధంగా పండిస్తారో విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వారికి ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా పాఠాలను బోధించారు.ఈ యొక్క కార్యక్రమంలో ఎంఈఓ అంజయ్య సార్ గారు, ప్రధానోపాధ్యాయులు తుల్జయ్య ,ఉపాధ్యాయులు సంతోష ,మహాలక్ష్మి పాల్గొన్నారు......