అమెరికాలో భారత యువతి పై ఆఫ్రికన్ లెంగిక దాడి .. దారుణ హత్య


వాషింగ్టన్‌ : అమెరికాలో భారత్‌కు(సంతతి) చెందిన టీనేజ్ యువతిని లైగికంగా వేధించి , దారుణంగా హత్య చేసిన ఘటన అమెరికాలోని తెలుగు రాష్ట్రాల వారిని కలవరపాటుకు గురిచేసింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లో హానర్స్‌ స్టూడెంట్‌ అయిన హైదరాబాద్‌కు చెందిన యువతి శనివారం క్యాంపస్‌ గ్యారేజ్‌లోని కారు వెనక సీటులో విగతజీవిగా కనిపించారు. బాధిత విద్యార్థిని కుటుంబం అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగుడు డొనాల్డ్‌ తుర్మన్‌ (26)ను చికాగో మెట్రో స్టేషన్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. నిందితుడికి యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేదని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. నిందితుడిపై హత్య, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

ఈ విషయం దృష్ట్యా ,  శుక్రవారం సాయంత్రం నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని యూనివర్సిటీ పోలీసులకు శనివారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. బాధితురాలికి ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో హల్‌స్టెడ్‌ స్ట్రీట్‌ పార్కింగ్‌ గ్యారేజ్‌లోని తన కారు బ్యాక్‌ సీటులో విగతజీవిగా పడిఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు డొనాల్డ్‌ దుశ్చర్యను పసిగట్టి చికాగో మెట్రో స్టేషన్‌ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. హెల్త్‌ ప్రొఫెఫషనల్‌గా మారి ఎందరికో సాయం చేయాలని కలలు కన్న యువతి విషాదాంతం తమను దిగ్ర్భాంతికి గురిచేసిందని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వర్సిటీ చాన్స్‌లర్‌ మైఖేల్‌ డీ అమిరిడిస్‌ పేర్కొన్నారు. ఇక ఆమె స్మృతి చిహ్నంగా యువతికి ఇష్టమైన పసుపు రంగు రిబ్బన్లను క్యాంపస్‌ అంతటా ఎగురవేసినట్టు సహచర విద్యార్ధి చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే స్వీట్‌ గర్ల్‌ను మిస్‌ అయ్యామని ఆమె జిమ్నాస్టిక్స్‌ మాజీ కోచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసును నమోదు చేశారు. లైంగికదాడి కింద కూడా కేసును బుక్ చేశారు. రూత్ పేరెంట్స్‌ది హైదరాబాద్ అని ప్రాథమికంగా తెలుస్తోంది.